సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో.. చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఆ తర్వాత పెరిగి పెద్దయి ఇక సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా రాణించడం ఇటీవల కాలంలో తరచూ జరుగుతోంది అని చెప్పాలి. ఇప్పటికే ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉండడం గమనర్హం. అయితే  అప్పుడప్పుడు కొంతమంది చైల్డ్ ఆర్టిస్టుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు నాచురల్ స్టార్ నాని సినిమాలో నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో వైరల్ గా మారిపోయింది. అయితే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు మాత్రం ఏకంగా హీరోయిన్ ను సైతం తలదన్నే అందంతో నేటిజన్స్ అందరిని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది.



 నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ అనే సినిమా వచ్చింది అన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో ఐదుగురు ఆడవాళ్లు అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు. కీలక పాత్రలో నటించినా ఐదుగురు నటిమనుల్లో శ్రీయ రెడ్డి కూడా ఒకరు. ఈమె సినిమాలో అయితే నటించి ఆకట్టుకుంది కానీ ఇక శ్రీయ రెడ్డి అటు ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే షూటింగ్ కంప్లీట్ కాగానే అమెరికాకు వెళ్లిన ఈమె అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే పనిలో పడింది.



 హైదరాబాద్కు చెందిన శ్రియ రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. అయితే ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పెరిగి పెద్దదయింది. నేను ఐదు ఆరో తరగతిలో ఉన్నప్పుడే విజయ్ దేవరకొండ తో కలిసి థియేటర్లో నటించాను. అప్పట్లో నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్ళేదాన్ని. అక్కడే ఆ నాటక దర్శకుడు తో పరిచయం ఏర్పడింది. నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నప్పుడు శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్ చేశాను. అక్కడ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కోఆర్డినేట్ నన్ను చూసి దర్శకుడు విక్రమ్ కుమార్ కి నా ఫోటోలు పంపించారు. ఇక ఆయన నన్ను పిలిచి సెలెక్ట్ చేశారు అంటూ శ్రియ రెడ్డి చెప్పుకొచ్చింది. అయితే నాని మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీయ   రెడ్డి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్య పోవాల్సిన  ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: