ప్రస్తుతం దేశావ్యాప్తంగా వున్న సినీ ప్రేక్షకులదరి దృష్టి కూడా డిసెంబర్ 22 పైనే ఉంది. దానికి కారణం తెలిసిందే. ఎందుకంటే అదే రోజున రెండు భారీ సినిమాలైన సలార్, డంకి బాక్స్ ఆఫీస్ వద్ద తలపడుతున్నాయి.అయితే వీటిలో డంకి సినిమా సెన్సిటివ్ అంశాలను చర్చించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే, మరొకటి ఊర మాస్ సినిమా అయిన సలార్.KGF సినిమాతో మాస్ సినిమాను రి-డిఫైన్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సలార్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక డంకి సినిమా విషయానికొస్తే బాలీవుడ్ లో అపజయం అంటూ తెలియని టాప్ డైరక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఒకే ఏడాదిలో రెండు బ్యాక్ టూ బ్యాక్ 1000 కోట్ల సినిమాలు ఇచ్చిన టాప్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా రాబోతున్న సినిమా డంకి.ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి రేపుతున్న సినిమాలే..కానీ ఈ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతుండటం ప్రస్తుతం నెట్టింటా చర్చినీయ అంశం అయింది.


ఇక డంకి సినిమా డిసెంబర్ 22 న రిలీజ్ చేయబోతున్నట్టు చాలా రోజుల క్రితమే ప్రకటించారు మేకర్స్. కానీ సలార్ సినిమా మాత్రం సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22 కు పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ విషయంలో అసలు రెండు సినిమాల మేకర్స్ తగ్గట్లేదు.దాంతో ఈ రెండు సినిమాల రిలీజ్ విషయంలో ఏ సినిమాకు ఎక్కువ రిస్క్ అనే అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చర్చినీయ అంశంగా మారింది.అలాగే రెండు సినిమాలకు కూడా బిజినెస్ గట్టిగానే జరుగుతుంది. ఓవర్ సీస్ లో కూడా భారీగా డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతున్నాయి.అయితే ఈ విధంగా రెండు భారీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవడం ఇదేమి కొత్తేమి కాదు. ఇంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు జరిగాయి. పైగా అలా రిలీజైన సినిమాలలో కొన్ని సార్లు రెండు సినిమాలు హిట్టైన సందర్భాలున్నాయి.ఇంకా అలాగే ఫ్లాప్ అయిన సిచువేషన్స్ కూడా ఉన్నాయి.అయితే ఈ కాలంలో సినిమా ఆడాలంటే ఖచ్చితంగా కంటెంట్ సాలిడ్ గా ఉండాలి.అది గనక ఈ రెండు సినిమాలో ఉంటె ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: