టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతుంది అంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్ స్క్రీన్ లో సైతం ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనేలాగా వీరిద్దరి కెమిస్ట్రీ ఉంటుంది. తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ ను ఉద్దేశిస్తూ 'నువ్వు ఎప్పటికీ ది బెస్ట్' అని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఉన్నట్టుండి రష్మిక విజయ్ గురించి పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'యానిమల్'.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి రణబీర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం ఉదయం టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా టీజర్ ని ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. 'యానిమల్' టీజర్ తనకు ఎంతో నచ్చిందని అన్నాడు." మై డార్లింగ్స్ సందీప్ రెడ్డి వంగ, రష్మిక అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు రణబీర్ కపూర్ కు ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్ డే" అని తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ పై తాజాగా రష్మిక స్పందించింది." థాంక్యూ విజయ్ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్" అని రిప్లై ఇచ్చింది. దీంతో వీళ్ళ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జోడి పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
'మీరు ఎప్పటికీ బెస్ట్ ఫెయిర్' అని సోషల్ మీడియాలో వరస పోస్టులు పెడుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు 'యానిమల్' టీజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్ చాలా వైలెంట్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ మొదటిసారి 'గీతాగోవిందం' సినిమాలో కలిసి నటించారు. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ మూవీతో వెండితెరపై సూపర్ హిట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమాలో కలిసి నటించారు. అందులోనూ మరోసారి తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో అదరగొట్టారు.