టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కనీసం ఈ సినిమా మెగా అభిమానులను కూడా మెప్పించలేకపోయింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాటు తన నెక్స్ట్ సినిమాల్లో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుంటున్నారట. ఇప్పటికే తన పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాలను అనౌన్స్ చేశారు.

ఇప్పుడు మరో సినిమాని లైన్లో పెట్టారు అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆ సినిమాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ఒకటి కాగా గీత ఆర్ట్స్ లో మరొక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు స్టార్ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో సైతం మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది అని సమాచారం.

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన కథ చర్చలు సైతం అన్ని పూర్తయ్యాయి అని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మూడవ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. త్వరలోనే ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం రాబోతుంది అని అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికి వస్తే బింబిసారా దర్శకుడు విశిష్టతో మెగా 157 సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తరగతి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: