
ఈ టాస్క్ గురించి చెప్పగానే శివాజీ అస్సలు ఆడనన్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ప్రతి టాస్క్ తప్పకుండా ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. లెటర్ ను చూడటానికి శివాజీ, పల్లవి ప్రశాంతి ఇద్దరు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లారు. శివాజీకి తన ఇంటి నుంచి లెటర్ తో పాటు ఒక కాఫీ కూడా అందింది. తనకు కాఫీ అంటే ఎంత ఇష్టమో హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుంచే చెబుతూనే ఉన్నాడు. శివాజీ తన భార్య పంపిన కాఫీ తాగగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు శివాజీ. ఏం త్యాగం చేయాలి అనే విషయంపై డిస్కషన్ మొదలుపెట్టారు. అయితే పల్లవి ప్రశాంత్ దగ్గర సమాధానం లేదు.
ఎవరు రాసి ఉంటారు. మీ అమ్మనా నాన్ననా అని అడిగాడు శివాజీ. అమ్మ రాయదు అంటూ ప్రశాంత్ సమాధానం ఇచ్చాడు. నీకు మీ నాన్న నాకు నా భార్య రాశారు అన్నాడు శివాజీ. నిజంగా చాలా మిస్ అవుతున్న. ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. అమ్మతో రోజు మాట్లాడుతా అంటూ తన గురించి చెప్పాడు శివాజీ. అయినా ప్రశాంత్ మాత్రం మౌనంగానే ఉండిపోయాడు. నాకు ఒకటే ఫీలింగ్ ఓపెన్ గా చెప్తున్న.. మనిద్దరమే ఆడుతాం అనుకున్నా.. అప్పుడు నీకు డైరెక్ట్ గా కెప్టెన్సీ ఇచ్చేద్దామనుకున్నా.. కామన్ మ్యాన్ ఇక్కడ వరకు తీసుకొచ్చాను అంటే వాడు గెలవాలి. నీకు ఎప్పుడో చెప్పాను గుర్తుందా.. నువ్వు చాలా దూరం పోవాలి చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలవాలి. కంటెండర్ కంటే కాఫీ ఇచ్చాడు చాలు నాకు. నువ్వు కంటెండర్ అవ్వు.. నా కొడుకు మీద పంతంతో వచ్చాను. వెనక్కి వెళ్ళడానికి రాలేదు నువ్వు ఊరు నుంచి వచ్చాను అని వచ్చి హాగ్ ఇచ్చావు. తర్వాత నీతో ఎవరు మాట్లాడటం మాట్లాడట్లేదు దూరంగా ఉంటున్నారు అన్నావ్. బిడ్డ నేను నీకు ఉంటా అని చెప్పాను కదా. ఆడు.. దున్ను.. కానీ లైన్ దాటొద్దు. నేను వెనక్కి తాగుతున్నాను. నువ్వు గెలవాలి కాబట్టి. నీ వెనకాల నిలబడతా అని చెబుతున్న నువ్వు గెలిచి చూపించరా అంటూ ప్రశాంత్ ని మోటివేట్ చేసాడు. తను వయసులో పెద్దవాడినని నా భార్య కూడా నన్ను అర్థం చేసుకుంటుందని.. తనకు వచ్చిన లెటర్ ను చింపేసి బయటకు వెళ్ళిపోయాడు శివాజీ.