బాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ ఖాన్. కానీ దాని తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో
బాలీవుడ్ కి దూరమయ్యాడు. ఇలాంటి ఒక
హీరో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
మంచి ఫిజిక్ ఉన్న హీరోగా కనిపించేందుకు తాను స్టెరాయిడ్లు తీసుకున్నట్లు చెప్పడం షాకింగ్ గా మారింది. కెరియర్ స్టార్టింగ్ లో తనను చాలా మంది ఫిలిం మేకర్స్ 'నువ్వు మగాడిలా లేవు, పిల్లాడిలా ఉన్నావ్.. హీరోయిన్ల నీకంటే పెద్దగా కనిపిస్తున్నారు' అని కామెంట్స్ చేశారని దాంతో బాడీ పెంచడంపై దృష్టి సారించానని అందులో భాగంగానే బాడీ పెరగడం కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు వెల్లడించాడు. జెనీలియాతో కలిసి 'జానే తూయ జానే నా' మూవీ తో పాటు 'ఢిల్లీ బెల్లీ', 'ఐ హేట్ లవ్ స్టోరీస్', 'మేరే బ్రదర్ కి దుల్హన్' వంటి సినిమాల్లో నటించాడు. బాలీవుడ్ లో హీరో అంటే కచ్చితంగా కండలు తిరిగిన బాడీ ఉండాలి. కానీ అందుకు పూర్తి వ్యతిరేకంగా సాధారణంగా బక్కపలుచగా కనిపించే ఇమ్రాన్ ఖాన్ ను మొదట్లో చాలా మంది అసలు హీరోగా అంగీకరించలేదట. 'నువ్వు అసలు మగాడిలానే లేవు, పిల్లాడిలా ఉన్నావ్ హీరోయిన్లు నీకంటే పెద్దగా కనిపిస్తారు' అనే కామెంట్స్ తో ఎంతో ఇబ్బంది పడిన ఇమ్రాన్ ఖాన్ ఆ తర్వాత బాడీ పెంచడానికి ఎంతో కసరత్తులు చేశారట. బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ 2008లో 'జానీ తు యా జానే నా' సినిమాతో బాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు. అప్పటికే సన్నగా ఉండడంతో తొలి సినిమా మొత్తం రెండు లేయర్ల దుస్తులు వేసుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. జిమ్ లో గంటల తరబడి చెమటోడ్చాను. అయినా కూడా ఇంకాస్త బాడీ పెంచు అని చాలామంది ఫిలిం మేకర్స్ అనేవారు. నువ్వు చాలా వీక్ గా ఉన్నావ్. మగాడిలా లేవు, పిల్లాడిలా ఉన్నావ్. హీరోయిన్లే నీ కంటే పెద్దగా కనిపిస్తారు అనే కామెంట్స్ కూడా చేశారు. దాంతో స్టెరాయిడ్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆ కామెంట్స్ నన్ను అభద్రతాభావంలోకి నెట్టేసాయి. శక్తివంతమైన హీరోలాంటి ఫిజిక్ కావాలని భావించాను. పోషకాహారం తినకుండా కసరత్తులు చేయడం వేస్ట్. రోజుకు ఆరుసార్లు 4 వేల కేలరీలు తినేవాడిని అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఇమ్రాన్ ఖాన్.