ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ  ఇచ్చి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. మొదట చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. అయితే రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మాస్ రాజా అభిమానులు. ఈ సినిమా ఈనెల 20వ తేదీన విడుదల కావడానికి రెడీగా ఉంది. ఈ క్రమంలోనే సినిమా రన్ టైం ఇప్పుడు మూవీ టీం కి చాలా ఇబ్బందిగా మారింది అన్న సమాచారం వినబడుతోంది.

అయితే ఇంతకుముందు రంగస్థలం వంటి సినిమా మూడు గంటలు ఉన్నా కూడా అభిమానులు ఏమాత్రం బోర్ గా ఫీల్ అవ్వలేదు. అంతేకాదు సినిమా భారీ విజయాన్ని కూడా అందుకుంది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమా సైతం మూడు గంటలకంటే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. అంతేకాదు మూడు గంటల కంటే ఎక్కువగా ఉండడం కారణంగా ఇందులో కొన్ని సన్నివేశాలను కట్ చేయాలి అనీ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ప్రతి సీన్ కూడా చాలా బాగా ఉంది అని ఏ సీన్ కట్ చేయాలి అన్నది డైరెక్టర్ కి కూడా అర్థం కావడం లేదు అని

 అందుకే సినిమా రన్ టైం అనుకున్న దానికంటే చాలా పెరిగిపోయింది అని సమాచారం. అయితే ఈ సినిమా రన్ టైమ్ తగ్గించడానికి ఏం చేయాలి అన్నది తెలియక డైరెక్టర్ ఇప్పుడు టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏం చేయాలి అన్నది తోచక మొదట సినిమా నుండి కొన్ని సీన్లను తొలగించి సినిమా సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత మళ్లీ వాటిని యాడ్ చేయాలి అని డైరెక్టర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విధంగా గతంలో చాలా సినిమాల విషయంలో చేశారు. అలా ఆ సినిమాలో మంచి టాక్ ని సంపాదించుకున్నాయి. మరి ఈ సినిమా కూడా ఆ సినిమా లాగా మంచి టాక్ తెచ్చుకుంటుందా భారీ విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: