దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా తో బిజీగా ఉన్నాడు. ఇందులో మొదటిసారిగా దిగవంత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. దాంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ దాదాపుగా 70 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం. అయితే జూనియర్ ఎన్టీఆర్కు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసే ఉంటుంది.

ఆయన గ్యారేజ్ లో ఇప్పటికే ఎన్నో రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. దానితోపాటు జూనియర్ ఎన్టీఆర్కి వాచ్ లంటే కూడా చాలా ఎక్కువ ఇష్టం. తన దగ్గర అత్యంత ఖరీదైన వాచెస్ చాలానే ఉన్నాయి. ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ కొత్త కొత్త వాచ్ లను ట్రై చేస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. అలా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త వాచ్ కొన్నాడు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వాచ్ ధర గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అయితే మాడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో సంగీత్ శోభన్ ఎన్టీఆర్ను కలిసారు.

వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ పై అందరి కన్ను పడింది. అయితే ఈ బ్రాండ్ వాచ్ ఎంబి అండ్ ఎఫ్ కంపెనీకి చెందినట్లుగా సమాచారం. ఇక దీని గురించి ఫాన్స్ గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అనంతరం దాని ఖరీదు చూసే షాక్ అవుతున్నారు. అయితే దాని ఖరీదు 1.66 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ నోరెళ్ళబెడుతున్నారు. అంతేకాదు ఈ డబ్బులతో ఒక సినిమాని తీయొచ్చు అని అంటున్నారు. అలా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వాచ్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే దేవర  అయిపోయిన తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: