నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల నుంచి కూడా ఇక ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా చక్రం తిప్పుతూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీకి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటే.. అటు మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఎదుగుతూ ఇండస్ట్రీ టాప్ హీరోగా మారారు అని చెప్పాలి.


 అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి  ఇక ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే సినిమాల మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఇద్దరు స్నేహితులుగానే మెలుగుతూ ఉండేవారు. గతంలో ఎవరి ఇంట్లో ఈవెంట్లు జరిగినా  మరొకరు అక్కడికి ఖచ్చితంగా హాజరయ్యేవారు. స్టేజ్ పైన ఇరువురు కూడా కలిసి సందడి చేసేవారు.


 ఇటీవల కాలం లో బిజీ షెడ్యూల్ కారణంగా అటు ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రేక్షకులు స్టేజ్ పై వీక్షించలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే గతంలో చిరంజీవి ఏకంగా బాలయ్య సినిమా ప్రమోషన్ వీడియోని చేశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త వైరల్ గా మారిపోయింది. బాలయ్య నటించిన ఆదిత్య 369 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా  ప్రమోట్ చేయడం కోసం చిరంజీవి విజయశాంతిని అప్రోచ్ అయ్యారట చిత్ర బృందం. సినిమా స్టోరీ తో బాగా ఇంప్రెస్ అయిన చిరంజీవి సినిమా ప్రమోషన్ చేయడానికి స్వయంగా చిరంజీవిని సినిమా ప్రమోషన్ కోసం ఒక వీడియో కూడా సిద్ధం చేశాడట. ఇక అప్పట్లో చిరంజీవి నిర్వహించిన ప్రమోషన్స్ చాలా హైలైట్ అయ్యాయని అందరూ చర్చించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: