టాక్ ఎలా ఉన్నా సినిమాకు మాత్రం భీభత్సమైన కలెక్షన్‌లు వచ్చాయి. కేవలం అడ్వాన్స్ రూపంలోనే హాఫ్ సెంచరీ మార్క్ టచ్ చేసింది. ఎన్నడూ లేని విధంగా తెలుగులో విజయ్ సినిమాకు కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక లియో సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. రజనీ కాంత్ తర్వాత తొలిరోజు వంద కోట్లు కొల్లగొట్టిన హీరోగా విజయ్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు కబాలి, రోబో 2.ఓ సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరాయి. విజయ్ క్రేజ్‌తో పాటు LCU హైప్ కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది.
ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమాకు దాదాపు రూ.15 కోట్ల రేంజ్‌లో కలెక్షన్‌లు వచ్చాయి. ఒక డబ్బింగ్ హీరో సినిమాకు అది కూడా దసరా పండగ సీజన్‌లో ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు వచ్చాయంటే మాములు విషయం కాదు. ఈ సినిమా జోరు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్‌లోపే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల పట్టనున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకొచ్చిన డివైడ్ టాక్ కలెక్షన్‌ల మీద ఏమైనా ప్రభావం చూపుతుందో చూడాలి మరి. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చాడు.