తమిళ హీరో విజయ్ నటించిన లియో సినిమా విడుదలై ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోగా  హీరోయిన్గా త్రిష నటించగా భారీ అంచనాల మధ్య గత వారం విడుదల అయ్యింది.కొన్నిచోట్ల కలెక్షన్స్ బాగానే రాబట్టిన మరికొన్ని చోట్ల దారుణంగా రాబట్టి మొత్తానికి ప్లాప్ సినిమాగా నిలిచిపోయింది. విజయ్ మరొకసారి మిస్టేక్ చేశారని ముందు అనుకున్న రేంజ్ లో ఈ సినిమా లేదని అందుకే ప్లాప్ అయిందని పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే లియో సినిమా ఇండస్ట్రీ హిట్ అని కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయని ఇప్పటికీ 500 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని విజయ్ ఫ్యాన్స్, ఇంకా విజయ్ PR టీం డబ్బా కొట్టుకుంటున్నారు. అంతేగాక ఇప్పటికే రజినీకాంత్ జైలర్ మూవీ వసూళ్ళని క్రాస్ చేసి తమిళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని డబ్బా కొట్టుకుంటున్నారు. ఇదంతా సినిమా వసూళ్లు పెంచడానికి చేసిన స్కామ్ అని సోషల్ మీడియాలో లియో స్కామ్ అనే ట్యాగ్ బాగా వైరల్ అయ్యింది.


ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు పక్కా ఫేక్ అని చాలా ఆధారాలు కూడా వస్తున్నాయి.ఈ సినిమా ఫేక్ వసూళ్ల గురించి ఏకంగా తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ హెడ్ అయిన తిరుపూర్ సుబ్రహ్మణ్యం చెప్పడం విశేషం. లియో భారీగా నష్టాలు తెచ్చిందని మూవీ టీం బలవంతంగా సినిమాని ఆడించమని డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు. నవంబర్ 3 వ తేదీ దాకా ఏ సినిమాని ఆడించకుండా లియోని ఆడించమని మూవీ టీం థియేటర్స్ ఓనర్స్ ని ఫోర్స్ చేస్తుందట.ఈ సినిమాకి కనీసం 10 టికెట్లు కూడా అమ్ముడు కాలేదంట.అందుకే ఈ సినిమా షోస్ ని క్యాన్సిల్ చేస్తున్నారు.దీన్ని బట్టి లియో సినిమాకి తప్పుడు వసూళ్లని చూపిస్తూ మూవీ టీం జనాలని మోసం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.కేవలం ఈ ఒక్క సినిమా అనే కాదు విజయ్ గత సినిమాల వసూళ్ళని కూడా తప్పుడు లెక్కలు వేసి పోస్టర్ లు వేసింది విజయ్ టీం.ప్రస్తుతం విజయ్ తమిళ స్టార్ డైరెక్టర్ విక్రమ్ ప్రభుతో తన 68 వ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

LEO