కెరియర్ ప్రారంభంలో కొన్ని హిందీ సినిమాల్లో నటించిన హన్సిక హీరోయిన్ గా మొదటగా తెలుగు సినిమా అయినటువంటి దేశ ముదురు లో నటించింది. అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుసగా హన్సిక కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక సినిమాలలో నటించిన ఈ బ్యూటీ చాలా సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే వరుసగా ఈ నటికి తెలుగులో అవకాశాలు తగ్గుతూ రావడంతో ఈ బ్యూటీ తన ఇంట్రెస్ట్ ను తమిళ సినిమా ఇండస్ట్రీ పై పెట్టింది. 

అందులో భాగంగా వరుస తమిళ సినిమాలలో నటించిన ఈ నటి చాలా సంవత్సరాల పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అవకాశాలు కాస్త తగ్గాయి అని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా హన్సిక "గార్డియన్" అనే ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాకు విజయ్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను అక్టోబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ తో అనుష్క ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: