వారసుడు సినిమా తర్వాత తమిళ హీరో జోసెఫ్ విజయ్  నటించిన తాజా చిత్రం లియో. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు నమోదు చేయలేక డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే లియో సినిమా గురించి నిర్మాత చెబుతున్న కలెక్షన్స్ ఫేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా స్పందించాడు.కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న తాజా సినిమా జపాన్. ఇక రాజమురుగన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి పండక్కు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మేకర్స్ జపాన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్ వచ్చాడు.


అయితే ఒక రిపోర్టర్ లోకేష్‌ను అడుగుతూ.. చాలా మంది కూడా లియో సినిమా కలెక్షన్స్ ఫేక్ అని అంటూన్నారు. దానిపై మీ అభిప్రాయం? ఎంటి అని అతన్ని అడిగారు. దీనికి లోకేష్ కనగరాజ్ సమాధానమిస్తూ.. ”నేను ఇంతకుముందే చెప్పాను. నేను ఏ సినిమా తీసినా కలెక్షన్ల మీద నాకు ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం థియేటర్‌లో రెస్పాన్స్ చూసాను.అప్పుడే జనాలకు నచ్చిందని తెలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్ సగం ల్యాగ్ అయిందని చాలా మంది చెబుతున్నారు. ఇక అది నా నిర్మాతనే చూసుకోవాలి. డైరెక్షన్‌తో నా పని అయిపోయింది. అంటూ లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చాడు.దీన్ని బట్టి లోకేష్ లియో సినిమాని పిచ్చ లైట్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది.ఇక సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌ ఇంకా సాండీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 19న ఈ సినిమా చాలా గ్రాండ్‌గా రిలీజై అట్టర్ ప్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: