ప్రజెంట్ టాలీవుడ్ లో మన స్టార్ హీరోలు అందరూ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో లాక్ అయిపోయారు. అలాగే మిడ్ రేంజ్ హీరోలు కూడా రెండు, మూడు ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉన్నారు. ఇక ఇలాంటి టైంలో స్టార్ డైరెక్టర్లకి హీరోలు దొరకడం నిజంగానే చాలా కష్టంగా ఉంది.అందువల్ల కొన్ని చిన్న సినిమాలకి రైటర్ అంటూ తమ పేర్లు వేసుకుని దర్శకత్వ పర్యవేక్షణ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఆడితే వారికి కూడా పేరొస్తుంది. ప్లాప్ అయితే ఆ క్రెడిట్ డైరెక్టర్ అకౌంట్లో పడుతుంది. ఏదేమైనా వారి పారితోషికం అయితే వారికి ఈజీగా వచ్చేస్తుంది.అయితే ఇంకొంతమంది దర్శకులు మాత్రం పరభాషా హీరోలకి కథలు చెప్పి ఒప్పించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు.బ్లాక్ బస్టర్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఆ లిస్ట్ లో ఒకడు అని చెప్పాలి. తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ బాబు, నాగార్జున వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన వంశీ పైడిపల్లి తమిళ హీరో విజయ్ తో వారసుడు అనే సినిమా చేశాడు.


సినిమా తమిళంలో బాగానే ఆడింది. ఇంకా తెలుగులో కూడా పర్వాలేదు అనిపించింది.అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 10 నెలలు కావస్తున్నా.. వంశీ పైడిపల్లి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. చరణ్ , ఎన్టీఆర్, మహేష్ వంటి పెద్ద హీరోలకి కథలు కూడా చెప్పాడు. కానీ ఏదీ కూడా అతనికి ఓకే అవ్వలేదు. పైగా చిన్న లేదా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసే రకంగా కూడా కాదు. నాకు పెద్ద హీరోనే కావాలి అని ఎన్నేళ్ళైనా వెయిట్ చేసే రకం వంశీ పైడిపల్లి.అందుకే తెలుగులో కాకపోయినా తమిళంలో అయినా పెద్ద హీరోని పట్టాలని అతను తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్ళీ విజయ్ కి తన కథ చెప్పాడు. ‘వారిసు’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి విజయ్ కూడా పాజిటివ్ గానే స్పందించాడు. ఇంకా అలాగే  వంశీ పైడిపల్లితో సినిమా అంటే అక్కడి హీరోలు కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: