తమిళ సిని పరిశ్రమలో ఫుల్ క్రేజ్ ఉన్న నటులలో శివ కార్తికేయన్ ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా "మా వీరన్" అనే తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి మడోనే అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తెలుగులో మహా వీరుడు పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకోగా ... టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ డీసెంట్ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే జెమినీ టీవీ లో ఈ సంస్థ వారు ప్రసారం చేశారు.

 ఇకపోతే ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 2.71 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. ఒక విధంగా చూసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కు బుల్లి తెర ప్రేక్షకుల నుండి కాస్త తక్కువ రెస్పాన్స్ ఏ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ లోని శివ కార్తికేయ నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: