ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ అండ్ కాస్ట్లీ చిత్రం ప్రస్తుతం ఏదైనా ఉంది అంటే అది పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మాసివ్ పాన్ వరల్డ్ చిత్రం "కల్కి 2898ఎడి"  అని చెప్పాలి.పాన్ వరల్డ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా మొదట ప్రాజెక్ట్ కే గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు అంతకు మించి చాలా గ్రాండ్ గా వెళ్తుంది.ఇక ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో  దర్శకుడు నాగ్ అశ్విన్ లేటెస్ట్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. తాను మొదట ఈ సినిమాకి మొత్తం వి ఎఫ్ ఎక్స్ షాట్స్ అన్నీ ఇండియా లోనే చేయిద్దాం అనుకున్నాను అని కానీ కొన్ని కారణాలు చేత అది సాధ్యపడలేదు బట్ దాదాపు వి ఎఫ్ ఎక్స్ వర్క్ మాత్రం లోకల్ గానే ఈ సినిమాకి చేశామని అశ్విన్ తెలిపాడు.


ఇక నెక్స్ట్ తన సినిమాకి మాత్రం పూర్తిగా ఇండియన్ టాలెంట్ తోనే బెటర్ వి ఎఫ్ ఎక్స్ డిజైన్ చేసి కంప్లీట్ ఇండియన్ ప్రాజెక్ట్ గా చేస్తానని తెలిపాడు.ఇక ప్రాజెక్ట్ కే విషయంలో నాగ్ అండ్ టీం స్టార్టింగ్ నుంచే ఎన్నో విభాగాల్లో ఇండియా వైడ్ గా ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులని ఆడిషన్ చేసిన సంగతి తెలిసిందే. అలా ప్రాజెక్ట్ కే తెరకెక్కుతూ వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కిస్తుందట. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇండియాలోనే టాప్ ఇండస్ట్రీగా చేస్తుందట. ఖచ్చితంగా ప్రపంచం మొత్తం మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూడటం ఖాయమాట. ఈ సినిమాని అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. ఇక నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కల్కి 2898 AD తో ఖచ్చితంగా రాజమౌలితో పోటీగా నిలుస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: