సినిమా ఇండస్ట్రీలో నైనా ప్రతి జనరేషన్లో చాలామంది స్టార్ హీరోలు ఉన్న ఒక్కరు మాత్రం ఇండస్ట్రీకి చాలా స్పెషల్ గా మారుతూ ఉంటారు. అలా బాలీవుడ్లో అమితాబచ్చన్ ఇండస్ట్రీ ని ఏలూతూ ఉండగా ఎంతోమంది హీరోలు రావడం జరిగింది. కానీ వాళ్లలో బాలీవుడ్ ని ఏలింది మాత్రం హీరో షారుక్ ఖాన్ ఒకరిని చెప్పవచ్చు. తన సినిమాల సక్సెస్ రికార్డులతో బాలీవుడ్ లో బాద్షాగా పేరు సంపాదించారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన షారుక్ ఖాన్ మొదటినుంచి సినిమాల మీద ఆసక్తి ఉండడంతో ముంబైకి వచ్చేసారట.


అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగారని ముంబైలో ఉండడానికి రూమ్ కూడా లేక డబ్బులు కూడా లేక కొన్నిసార్లు బీచ్ పక్కన చాలా రోజులు పడుకున్నానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా చిన్న చిన్న సీరియల్స్ లో పలు పాత్రలు చేసి సినిమాలను కూడా చిన్న పాత్రలు చేస్తూ ఒక నాలుగేళ్ల పాటు అలాగే గడిపేసానని.. అయితే మొదటిసారి 1992లో దివానా అనే చిత్రంలో ఫుల్ క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ చేసి వెండితెర పైన చాలా సేపు కనిపించారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సెకండ్ హీరోగా చాలా సినిమాలలో నటించారట.


1993 లో వచ్చిన బాజీగర్, దర్ సినిమాలలో విలన్ గా కూడా నటించడం జరిగింది.. ఆ తర్వాత విలన్ రోజు వచ్చిన రిజెక్ట్ చేశారట. మళ్లీ సెకండ్ హీరోగా చిన్న సినిమాలలో నటించారు.. 1995లో ఆదిత్య చక్ర దర్శకత్వంలో షారుక్ ఖాజాల్ నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయింగే  సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నది ఇప్పటికీ చిత్రం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా పేరు అందుకున్నారు. అక్కడి నుంచి షారుక్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగి. అప్పటినుంచి లవ్ సినిమాలలో నటించి అమ్మాయిల కలల రాకుమారుడు గా మారారు. 2006లో వచ్చిన డాన్ సినిమాతో ఒక్కసారిగా మాస్ హీరోగా పేరు సంపాదించారు. 2016 లో షారుక్ ఖాన్ చేసిన ప్రయోగ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత 2018లో జీరో సినిమా తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ ఏడాది ఏకంగా పఠాన్ సినిమాతో ఏకంగా 1000 కోట్ల రూపాయలు కలెక్షన్స్ అందుకున్నారు ఆ తర్వాత జవాన్ సినిమాతో 1100 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో మళ్ళీ రికార్డు బద్దలు కొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: