టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా భగవంత్ కేసరి.ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ముఖ్య పాత్రలో నటించింది.ఇటీవల భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా లో పవర్ఫుల్ రోల్ లో బాలకృష్ణ మరొక్కసారి తన యాక్టింగ్ తో అదరగొట్టగా అనిల్ రావిపూడి తన స్టైల్ టేకింగ్ తో మళ్ళీ ఆకట్టుకొని తానేంటో నిరూపించుకున్నాడు.ఇక ఇప్పటికే మూడవ వారంలోకి అడుగుపెట్టిన భగవంత్ కేసరి సినిమా ఇంకా  మంచి వసూళ్లు అందుకుంటూ ఉండడం విశేషం.  


తమకు ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకాభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పేందుకు నవంబర్ 9 వ తేదీన హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించేందుకు భగవంత్ కేసరి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. అతి త్వరలో దీనికి సంబంధించి వారి నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మితం అయింది.ఈ సినిమా ఇప్పటిదాకా 70 కోట్ల దాకా షేర్ ఇంకా 140 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. అలాగే అనిల్ రావిపూడికి వరుసగా 4 వ 100 కోట్ల సినిమాగా ఈ సినిమా నిలిచింది. ఇప్పటివరకు వరుసగా 4 పైగా 100 కోట్ల సినిమాలు వున్న డైరెక్టర్ గా కేవలం రాజమౌళికి మాత్రమే ఉండేది. ఆయన తరువాత వరుసగా 4 100 కోట్ల సినిమాలు తీసిన ఘనత అనిల్ రావి పూడికి దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: