అయితే పాయల్ తన కామెంట్స్ ని ఒక ట్విట్టర్ రూపంలో తెలియజేసింది.. రెగ్యులర్గా బాలీవుడ్ లో ఏదో ఒక విషయం పైన సంచలన ట్విట్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలకృష్ణ పైన ట్విట్ చేయడం జరిగింది. గతంలో బాలకృష్ణతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసి బాలీవుడ్ నటులు బాలకృష్ణ సార్ ని చూసి నేర్చుకోవాలని ఈ ఏజ్ లో కూడా వరుసగా విజయాలు అందుకుంటున్నారంటూ ట్విట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ గా మారుతోంది.
బాలకృష్ణ అభిమాను లు మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే..బాలీవుడ్ నేటిజన్స్ మాత్రం ఈమె ను విమర్శిస్తూ ఉన్నారు. ఇక పాయల్ ఘోష్ ఇప్పుడిప్పుడే మళ్ళీ పలు రకాల వీడియో ఆల్బమ్స్ సైతం చేస్తూ యూట్యూబ్లో కూడా ఓటీటి లలో కూడా తన సత్తా చాటడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అంతేకాకుండా గతంలో జూనియర్ ఎన్టీఆర్ పైన పలు విషయాలను తెలియజేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ ఘోష్ ఇప్పుడు మళ్లీ బాలకృష్ణ పైన చేయడంతో ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక ట్వీట్ వైరల్ గా మారుతోంది.