పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సినిమా చేయాలని ఎంతో మంది డైరెక్టర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్ తో సినిమా అంటే కచ్చితంగా కథలో కంటెంట్ తో పాటు ఆ కంటెంట్ ని సరిగ్గా డీల్ చేసే టాలెంట్ ఉండే డైరెక్టర్ అయి ఉండాలి. దానికి తోడు భారీ నిర్మాత కూడా ఉండాల్సిందే. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకి లేనన్ని కమిట్మెంట్స్ ప్రభాస్ కు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే కమిట్ అయిన మూవీస్ ని పూర్తి చేసే పనిలో ఉన్న డార్లింగ్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 

ఆ ప్రాజెక్ట్ మరెవరితోనో కాదు గత ఏడాది 'దసరా' సినిమాతో పాన్ ఇండియా డెబ్యూ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో అని సమాచారం. నాచురల్ స్టార్ నాని లో మాస్ యాంగిల్ ని బయట పెడుతూ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన 'దసరా' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన శ్రీకాంత్ ఓదెల 'దసరా' మూవీతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాతోనే తన ప్రతిభను కనబరిచాడు. నానిని ఎప్పుడూ చూడని విధంగా ఊర మాస్ లెవెల్లో చూపించి ప్రశంసలు అందుకున్నాడు. 'దసరా' వచ్చి ఏడాదికి పైగా దాటినా ఇప్పటివరకు తన తదుపరిచిత్రాన్ని ప్రకటించలేదు శ్రీకాంత్ ఓదెల. 

అయితే గత కొద్ది నెలలుగా ప్రభాస్ కోసం శ్రీకాంత్ ఓ కథను సిద్ధం చేస్తున్నారట. పాన్ ఇండియా లెవెల్ లో సూట్ అయ్యే ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ స్టోరీని కంప్లీట్ చేసి ప్రభాస్ ని అప్రోచ్ అవ్వబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది. ప్రభాస్ కి కనుక కథ నచ్చితే ఆలస్యం చేయకుండా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు కచ్చితంగా ప్రభాస్ కి ఈ కథ నచ్చుతుందని నమ్మకంతో ఈ డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: