ఇక తాజాగా హైదరాబాద్ కి తిరిగి వచ్చేసిన ప్రభాస్ త్వరలోనే సలార్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం.   దాదాపు మూడు నెలల విరామం తర్వాత డార్లింగ్ హైదరాబాదులో అడుగుపెట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.    'సలార్' మూవీని డిసెంబర్ 22న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసినా ఇప్పటివరకు మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ విషయంలో ఫ్యాన్స్ కొంత నిరాశకు లోనవుతున్నారు. దానికి తోడు సలార్ మరోసారి వాయిదా పడబోతుందనే వార్తలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి.

 ఇక ప్రభాస్ రాకతో ఫ్యాన్స్ ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చేసిన ప్రభాస్ త్వరలోనే మూవీ టీం తో కలిసి 'సలార్' ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని నెలలుగా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న ప్రభాస్ సర్జరీ కోసం ఇటీవల యూరప్ లోని ఇటలీకి వెళ్ళిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలోనే మోకాలు నొప్పికి సంబంధించిన సర్జరీ పూర్తి చేసుకున్నాడు ప్రభాస్. కానీ కంప్లీట్ రెస్ట్ తీసుకోవాల్సి ఉండడంతో గత మూడు నెలల నుంచి ఇటలీలోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. సుమారు మూడు నెలల తర్వాత ప్రభాస్ ఇండియాకి తిరిగి రావడంతో ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇక 'సలార్' విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. కంప్లీట్ గ్యాంగ్ స్టర్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు 'సలార్' ప్రమోషన్స్ తో పాటు మరోవైపు తన తదుపరి సినిమా షూటింగ్ లపై కూడా ఫోకస్ చేయనున్నారట ప్రభాస్.


 

మరింత సమాచారం తెలుసుకోండి: