సీనియర్ హీరో చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. హీరో గానే కాకుండా కమెడియన్ గా పలు చిత్రాలను క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు వైవిద్యమైన పాత్రలలో నటించి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న చంద్రమోహన్ 1966లో రంగుల రత్నం అనే చిత్రం ద్వారా తన కెరీర్ ని ప్రారంభించారు.. హీరోగా 172 చిత్రాలలో నటించినప్పటికీ మొత్తం 932 సినిమాలలో నటించడం జరిగిందట చంద్రమోహన్. ఇండస్ట్రీలో హీరోయిన్లకు లక్కీ హీరోగా పేరు సంపాదించిన చంద్రమోహన్ శ్రీదేవి, జయప్రద ,జయసుధ వంటి హీరోయిన్లను స్టార్స్ గా మార్చారు.


అయితే ఇటీవలే చంద్రమోహన్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఈరోజు తన ఆరోగ్యం క్షీణించడంతో అపోలో హాస్పిటల్ కి చేర్పించగా ఉదయం మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. చంద్రమోహన్ భార్య జలంధర వీరికి ఇద్దరు కుమార్తెలు. చాలామంది చంద్రమోహన్ దగ్గరకు వచ్చి మాటలు చెప్పి తన డబ్బులను తీసుకుంటూ ఉంటారని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. గతంలో సీనియర్ నటుడుగా పేరుపొందిన శోభన్ బాబు గారి మాట తను వినలేకపోయానని అందువల్లే 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తిని పోగొట్టుకున్నారని తెలియజేశారు.


అయితే కొంపల్లి దగ్గర మాత్రం గొల్లపూడి మారుతి రావు గారి మాట విని దాదాపుగా 30 ఎకరాలకు పైగా దాక్ష తోటను కొన్నాను కానీ వాటిని సరిగా మెయింటైన్ చేసుకోలేక అమ్మేశాను చెన్నైలో కూడా 10 ఎకరాలు కొన్నాను అమ్మేశాను శంషాబాద్ దగ్గర ఆరు ఎకరాలు ఉన్నది అది కూడా అమ్మేశాను శోభన్ బాబు గారు అవి అమ్మేటప్పుడు వద్దని ఎంత చెప్పినా కూడా తాను వినలేదని అలా సుమారుగా 100 కోట్ల రూపాయల ఆస్తిని పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చంద్రమోహన్ తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. చంద్రమోహన్ మరణ వార్త విని సినీ సెలబ్రిటీలతోపాటు ఆయన అభిమానులు ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: