టాలీవుడ్ లో నటుడు చంద్రమోహన్ వందకు పైగా సినిమాలలో హీరోగా నటించడం జరిగింది. విలక్షణమైనటుడిగా పేరు సంపాదించిన చంద్రమోహన్ కె.విశ్వనాథ్ బంధువులు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ -విజయనిర్మల ఫ్యామిలీతో కూడా చంద్రమోహన్ కు చాలా అనుబంధం ఉన్నది.అందుకు కారణం కృష్ణ విజయనిర్మల పెళ్లి వెనుక చంద్రమోహన్ హస్తం ఉందని సమాచారం.. కృష్ణ విజయనిర్మల కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు సక్సెస్ లో బాగానే అందుకున్నాయి.



విజయనిర్మల తెరకెక్కించిన చిత్రాలలో హీరోగా సూపర్ స్టార్ కృష్ణనే నటించేవారు.. దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నది. ఆ అనుబంధం ప్రేమగా మారి దూరంగా ఉండలేక వీరిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారట.. కానీ అప్పటికే కృష్ణకు ఇందిరా దేవితో వివాహం అయ్యింది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. విజయనిర్మలకి కూడా వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాంటి సమయంలోనే వీరిద్దరూ వివాహం చేసుకోవాలనుకోవడంతో వీరిద్దరికి అండగా నిలిచిన నటుడు చంద్రమోహన్ వీరికి మనో ధైర్యాన్ని తెలుపుతూ దగ్గరుండి వివాహాన్ని చేశారట. తిరుపతిలో వీరి పెళ్లికి సంబంధించి అన్ని విషయాలను చంద్రమోహనే దగ్గరుండి చూసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.


అందుకే కృష్ణ, విజయనిర్మలకు తాను చాలా ఇష్టమని తన సొంత కుటుంబంలో మనిషిలా చూసుకుంటారని ఎంతో ఆప్యాయతగా తనని పలకరిస్తూ ఉంటారని తెలిపారు. విజయనిర్మల కూడా తనని సొంత అన్నలా చూసుకునేది.. ఆవిడ డైరెక్టర్ చేసిన సినిమాలలో తను చాలా సినిమాలలో మంచి పాత్రలు నటించానని తెలిపారు. దాదాపుగా 5 దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో రాణించిన చంద్రమోహన్ దాదాపుగా 900  పైగా సినిమాలలో నటించారు. 175 చిత్రాలలో హీరోగా నటించిన గమనార్హం పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన మరికొన్ని చిత్రాలలో నెగిటివ్ రోల్స్ పాత్రలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: