ఆయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి వేలాదిమంది ఆయన అభిమానులు, రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులు , ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఇక అనేకమంది ఆయన మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఆయన మరణించిన మూడోరోజు అంత్యక్రియలు నిర్వహించడానికి కారణం ఆయన పెద్ద కుమార్తె అని తెలుస్తోంది. ఆమె అమెరికా నుంచి రావడానికి సమయం పడుతుంది. కాబట్టి అందుకే ఆయన అంత్యక్రియలు వాయిదా వేసినట్లు సమాచారం .
చంద్రమోహన్ కు ఇద్దరు కుమార్తెలు ఉండగా అందులో పెద్ద కుమార్తె మధుర మీనాక్షి అమెరికాలో ఉంటున్నారు. ఆమె అక్కడ ఒక సైకాలజిస్ట్ గా పని చేస్తున్నట్లు సమాచారం. చిన్న కూతురు మాధవి మాత్రం చెన్నైలోనే ఉంటున్నారు. అయితే మధుర మీనాక్షి అమెరికా నుంచి రావడానికి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో అంత్యక్రియలను సోమవారానికి వాయిదా వేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగుతున్నాయని తెలిసి ఆ ప్రాంతానికి సినీ ప్రముఖులు అభిమానులు పెద్ద ఎత్తున బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చంద్రమోహన్ విషయానికి వస్తే.. ఒకప్పుడు ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరియర్ ను ప్రారంభించారు. అంతేకాదు ఎంతో మంది హీరోయిన్లకు లక్కీ హీరోగా కూడా మారిన ఈయన మరణించడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.