తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతున్నది. గుంటూరు కారం సినిమా షూటింగ్ ఫైనల్ కు చేరుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మేకర్స్ క్లైమాక్స్ ను సైతం షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 5 కోట్ల రూపాయల సెట్టింగ్ లో గుంటూరు కారం సినిమా క్లైమాక్స్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫైట్ కోసం ఫైట్ మాస్టర్స్ కూడా తెగ కష్టపడుతున్నారని ఈ యాక్షన్ సన్నివేశం కూడా అభిమానులకు నచ్చేలా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్ లో సినిమా కాకపోయినా ఈ సినిమాకి దాదాపుగా 150 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ పెరిగిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ బడ్జెట్ కి అనుగుణంగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతోందని సమాచారం. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ వల్ల ఈ సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ అయితే హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు తెలుపుతున్నారు. ఇందులో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. జగపతిబాబు విలన్ గా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ఖచ్చితంగా విడుదలవుతుందని చెప్పవచ్చు.