టాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి. ఇటీవల పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అది కొద్ది మంది బంధువులు సన్నిహితులు మెగా కుటుంబం సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు ఈ జంట. ఇక దాదాపుగా వారి పెళ్లి జరిగి 15 రోజులు ముగుస్తోంది. ఇప్పటికి వారికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ వివాహ వేడుకలోని బెస్ట్ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలను మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ తమ అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ఆసక్తికర ఫోటోని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. దీంతో ఆయన షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోలకి అతడు పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. అదంతా చూస్తుంటే వరుణ్ పెళ్లిలో సాయిధరమ్ తేజ్ బాగానే ఎంజాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆయన షేర్ చేసిన పోస్టులో ఏముంది అంటే.. ఈ పోస్టులో సాయి ధరమ్ తేజ్ ఏం రాసుకొచ్చాడంటే.. పెళ్లిలో వరుణ్ తేజ్‌ కొత్త పెళ్లికొడుకుగ్గా ముస్తాబై కారులో ఊరేగుతూ వస్తున్నాడు.

 ఆ కారుకు అడ్డుపడుతూ ఈమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఎంతపని చేశావురా వరుణ్ అంటూ ఆటపట్టించినట్టుగా కనిపించాడు. ఆ కారుపై కాలు పెట్టి మాకేంటి ఇది.. అన్నట్టుగా ప్రశ్నిస్తుంటే.. కారు లోపల వరుణ్ మాత్రం చిరునవ్వు చిందిస్తున్నాడు. ఇదే ఫొటోను షేర్ చేస్తూ ఓ ఫన్నీ క్యాప్షన్ పెట్టాడు తేజ్. 'ఎందుకు, క్యూన్, యేన్, వై.. ఎంతపని చేశావు రా వరుణ్ బాబు.. ఉష్.. నీకు పెళ్లి సంబరాలు.. నాకేమో స్వతంత్ర్య పోరాటం' క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. అలా ప్రస్తుతం తేజ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో తేజ్ చేసిన పోస్ట్ చూసి అందరూ తెగ ఖుషి అవుతున్నారు. మరికొందరు వరుణ్ పెళ్లి చేసుకున్నాడు మరి నువ్వు ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు అని ప్రశ్నిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: