ఆదిరెడ్డి బెంగళూరులో గతంలో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవారట.. కానీ బిగ్బాస్ షో గురించి మాట్లాడడం చూసి యూట్యూబ్లో రివ్యూ చేయమని తన స్నేహితుల సైతం ఎక్కువగా సలహా ఇచ్చారట. ఆ సలహా మేరకే కొన్ని వీడియోలను కూడా స్టార్ట్ చేయక అందుకు ప్రేక్షకు ఆదరణ భారీగా పెరగడంతో అప్పటినుంచి ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూ వీడియోలను సైతం అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే బిగ్ బాస్ సీజన్ -6 లో కూడా అవకాశాన్ని సంపాదించుకోగా కానీ ఫైనల్ గా విన్నర్ కాలేకపోయారు. బిగ్బాస్ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వీడియోలకు మరింత పాపులారిటీ పెరిగిపోయింది.
ప్రస్తుతం రన్ అవుతున్న సీజన్-7 కి ఆదిరెడ్డి వరుసగా రివ్యూ వీడియోలను సైతం చేస్తూ ఉన్నారు. తనకు ఎలా అనిపించిందో మాత్రమే తెలియజేస్తూ ఉంటారుఆది రెడ్డి. తాజాగా ఆదిరెడ్డి యూట్యూబ్ నెల సంపాదన తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ నవంబర్ నెలకు సంబంధించి ఇప్పటివరకు 15 లక్షల రూపాయలు సంపాదించిన ఆదిరెడ్డి అక్టోబర్ నెలకు ఏకంగా 39 లక్షల రూపాయల ఆదాయాన్ని అందుకున్నారు. తాజాగా తన ఆదాయాన్ని రివిల్ చేసి నేను ఎప్పుడూ కూడా పారదర్శకంగానే ఉంటానంటూ తెలిపారు. పెయిడ్ బిగ్ బాస్ రివ్యూ ని అసలు చేయనని యూట్యూబ్ తప్ప ఎవరు తనకి పే చెయ్యారని తెలియజేశారు. ఎక్కువగా తన చానల్స్ ను అమెరికా వాళ్లు చూడడం వల్లే ఇలా ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తోందని తెలిపారు.