అత్యంత భారీ అంచనాలతో డిసెంబర్ 1న విడుదలకాబోతున్న ‘యానిమల్’ మూవీ పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు ఈమూవీ దర్శకుడు సందీప్ వంగా కొన్ని మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెపుతున్న మాటలతో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లో గొడ్డలి పట్టుకుని శత్రువులను ఊచకోత కోసిన టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే.



త్వరలో ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదలచేయబోతున్నారు. ఈట్రైలర్ లో వయొలెన్స్ ఎవరు ఊహించనంత స్థాయిలో ఉంటుందని సందీప్ వంగా చెపుతున్నాడు. లేటెస్ట్ గా ఈసినిమాకు సంబందించి విడుదలచేసిన ‘నాన్నా నువ్వంటే నా ప్రాణం’ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఇక ఈసినిమాకు సంబంధించి  లాంచ్ చేశారు. రణబీర్ కపూర్ ఫ్లైట్లో మందుకొట్టి తర్వాత వెళ్ళి పైలట్ స్థానంలో కూర్చుని డ్రైవ్ చేసే సన్నివేశానికి యూత్ విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు.



ఈసినిమాలో రణబీర్ కపూర్ కొన్ని సీన్స్ లో రణబీర్ క్లీన్ షేవ్‌ తోను మరికొన్ని సీన్స్ లో గుబురు గడ్డంతో కనిపించడమే కాకుండా ఛాతీ మీద కత్తి గాటుకు చికిత్స తీసుకుంటున్నట్లుగా కనిపిస్తున్న సీన్స్ పై ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరి కొన్ని రోజులలో దుబాయ్‌ బుర్జ్ ఖలీఫా వేదికగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కాబోతోంది.



ఇక ఈసినిమా నిడివి విషయంలో వస్తున్న వార్తల పై దర్శకుడు సందీప్  వంగా క్లారిటీ ఇవ్వడం లేదు. ఈసినిమా నిడివి మూడు గంటల ముప్పై నిముషాలు రావడంతో ఈమూవీకి 2 ఇంట్రవెల్స్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన పై ఈమూవీ దర్శక నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు టాక్. అయితే ఇంత నిడివితో ఉన్న సినిమాను సగటు ప్రేక్షకుడు ఎంతవరకు అసహనానికి లోను కాకుండా ఎంతవరకు ఈ సినిమాను ఆదరిస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: