దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా వరల్డ్ లెవెల్ లో సక్సెస్ అయ్యింది. మల్టీస్టారర్ గా వచ్చిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించినా ఇద్దరు కూడా పెద్ద స్టార్ హీరోలో కావడంతో ఎవరిని తక్కువగా చేసి చూపించలేదు రాజమౌళి. దీంతో ఈ ఇద్దరి హీరోలకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ బాగా ప్లస్ అయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

కీరవాణి అందించిన మ్యూజిక్ పాటలు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక ఇందులో నాటు నాటు పాట గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఈ పాట సోషల్ మీడియాలో ఎప్పుడో కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది. నాటు నాటు సాంగ్ అస్కార్ అవార్డు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా మంది నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేశారు. ఇప్పటికీ కొందరు సినీ సెలబ్రెటీలు ఈ సాంగ్ కు స్టెప్పులు వేసి రీల్స్ తీస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ పై నేచురల్ స్టార్ నాని కొడుకు తన డ్యాన్స్ తో ఇరగదీశాడు. నేచురల్ స్టార్ నాని సినిమాల్లో కనిపించడమే

గానీ పర్సనల్ విషయాలను తక్కువగా బయటపెడుతూ ఉంటారు. కానీ తాజాగా తన కుమారుడికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో నాని కొడుకు వేసిన స్టెప్పులకు తండ్రి నాని ఎంతో మురిసిపోయాడు. నాని కూడా స్టెప్పులు వేశాడు. నవంబర్ 14 సందర్భంగా ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ సందర్బంగా హ్యాపీ చిల్ట్రన్స్ డే అని క్యాప్షన్ పెట్టాడు. అంతేకాకుండా తండ్రి లాగే కుమారుడు స్టెప్పులతో ఇరగదీస్తున్నాడని అంటున్నారు. ఈ వీడియోను నాని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఇక నాని సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమా చేస్తున్నాడు. శౌర్యవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాల్లో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: