నేషనల్ క్రష్ గా  పేరు తెచ్చుకున్న రష్మిక మందనకి సంబంధించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఎంతటి సంచలనని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేసి రాక్షసనం దాన్ని పొందుతున్నారు. ఇక ఇలాంటి వీడియోలు వల్ల చాలామంది బాధపడుతున్నారు. కానీ అలా ఎందరు బాధపడుతున్నారు మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే రష్మిక మందనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో తన అభిమానులు అందరితోపాటు

సినీ ఇండస్ట్రీ మొత్తం తనకి సపోర్ట్ గా నిలిచింది. అయితే తాజాగా ఇప్పుడు రష్మిక మందన మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి సైతం తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక మందన కి సంబంధించి విడుదలైన డీప్ ఫేక్ వీడియో పై స్పందించే సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయన మాట్లాడుతూ.. “డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయకుండా ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ముందు ముందు ఇలాంటి తప్పులు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎలాంటి సాఫ్ట్ వేర్ క్రియేట్ చేసినా దానికంటూ ఓకే లైసెన్స్ ఉండేలా చూసుకోవాలి.

అది లిమిట్ దాటినప్పుడు వెంటనే అడ్డుకోనేలా ఉండాలి. ఆలాంటి రూల్స్ వచ్చినప్పుడు ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు. అలా చేయలేకపోతే ఇలాంటి ఘటనలు ముందు ముందు ఇంకా జరుగుతూనే ఉన్తయి. రష్మిక.. ఎంతో మంచి భవిష్యత్తును కలలు కంటున్న అమ్మాయి” అని పాజిటివ్ గా చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంచితే ఇక రష్మిక మందిని సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప టు లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేంగా జరుగుతోంది. దాంతోపాటు ఈ అనిమల్ సినిమాలో సైతం నటిస్తోంది. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: