బాలకృష్ణ స్టామినాను మరోసారి రుజువు చేసిన ‘ఆన్ స్టాపబుల్’ సీజన్ 3 కి సంబంధించి రష్మిక రణబీర్ కపూర్ ల ‘యానిమల్’ మూవీ ప్రమోషన్ కోసం ఆహా లో స్ట్రీమ్ అవుతున్న బాలయ్య అన్ స్టాపబుల్ షోకి ఏకంగా బాలీవుడ్ టాప్ హీరో రణబీర్ కపూర్ రష్మికలు కలిసి ఆ షోకు రావడం ఇప్పుడు సంచలన వార్తగా మారిన విషయం తెలిసిందే.



‘ఆహా’ లో స్ట్రీమ్ కాబోతున్న ఈ టాక్ షోలో బాలయ్య తన విశ్వరూపం చూపించినట్లు ఈ టాక్ షోకి సంబంధించిన టీజర్ ను చూసిన వారికి తెలుస్తుంది. ఈనెల 24 నుండి ఆహాలో ప్రసారం కాబోతున్న ఈ టాక్ టాక్ షోకి సంబంధించిన పబ్లిసిటీ వీడియోలో బాలయ్య తన విశ్వరూపం చూపించడమే కాకుండా రష్మిక ప్రేమ గుట్టును రట్టు చేసినట్లు కనిపిస్తోంది.  



ఈ షోకి సంబంధించిన గేమ్ లో భాగంగా బాలయ్య విజయ్ దేవరకొండ రణబీర్ కపూర్ లో ఎవరు అందంగా ఉంటారు రష్మికను కార్నర్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ షోకి సంబంధించినా లైవ్ లో బాలయ్య రష్మిక తో విజయ్ దేవరకొండకు ఫోన్ చేయించినప్పుడు రష్మిక సిగ్గుతో పెళ్లికూతురు లా ప్రవర్తించడం చూసిన వారు ఇప్పటికీ విజయ్ రష్మికల మధ్య ఏదో నడుస్తోందా అన్న సందేహాలు కలుగుతాయి.



ఇది చాలదు అన్నట్లుగా దీపావళి రోజున రష్మిక విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళింది అంటూ సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్పులను అటు రష్మిక కానీతూ విజయ కానీ ఖండిచకపోవడంతో మళ్ళీ వీరిద్దరి మధ్యన సాన్నిహిత్యం మొదలైందా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక తన ఆశలు అన్నీ డిసెంబర్ 1న విడుదల కాబోతున్న ‘యానిమల్’ మూవీ పైనే ఆశలు పెట్టుకుంది. అంచనాలకు అనుగుణంగా ఈ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అయితే రష్మిక మ్యానియా బాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీని షేక్ చేసే ఆస్కారం ఉండి అని అనుకోవాలి..






మరింత సమాచారం తెలుసుకోండి: