టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు విష్ణు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక వరుస ప్లాపులతో ఇంకా ట్రోల్స్ ఎదురుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాడు. గతేడాది విష్ణు నటించిన జిన్నా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈయన తన డ్రీమ్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కన్నప్పను శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఈ మధ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే.ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీగా వస్తోన్న ఈ సినిమా పై ఎన్నో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే విష్ణు కూడా ఎక్కడ తగ్గట్లేదు. అందులో భాగంగా ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర 10 నిమిషాల పాటు ఉంటుందట. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీతో ఆయనకు ఉన్న స్నేహం కారణంగా  ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రభాస్‌కు జోడిగా ఈ సినిమాలో నయనతార పార్వతి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఫ్యాన్ ఇండియా స్థాయిలో భారీగా వస్తోన్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.


ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళీ మెగాస్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ఆయన ఈ మూవీలో ఓ కీలకపాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాను డైలాగ్ కింగ్ మోహన్ బాబు చాలా భారీగా నిర్మిస్తున్నారు. మోహన్ లాల్‌తో పాటు ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.దాదాపుగా 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న  ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ ప్లస్ లో మహాభారత్ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథకి కీలక మెరుగులని దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: