హీరోయిన్ గా 20 ఏళ్లకు పైగా కొనసాగుతూ.. నాలుగు పదుల వయస్సు దాటినా.. ఈ విధంగా మెయింటేన్ చేయడం అందరికి సాధ్యం కాదు. ఈ విషయంలో శ్రీయా 100 మార్కులు సాధించింది. పెళ్ళై, పిల్లలు పుడితే అందం పాడవుతుందని.. సరోగసీలను ఆశ్రయిస్తున్న టైమ్ లో.. శ్రీయా మాత్రం నవమాసాలు మోసి.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది.హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది.టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది శ్రీయా శరణ్.. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ అందరి సరసన మెరిసింది బ్యూటీ.
పెళ్ళై పాప పుట్టిన తరువాత కూడా ఏమాత్రం బ్యూటీ తగ్గకుండా మునుపికంటే అందంగా తయారయ్యింది శ్రియా. అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీని చూసుకుంటూ.. సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గకుండా అందాల విందు చేసుకుంటూ వస్తోంది. ఒక్కోసారి శ్రీయా శృతి మించిన అందాలు కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తుంటాయి.ఏజ్ బార్ అవుతున్నా.. సినిమాల విషయాల్లో ఒక పద్దతిని పాటిస్తూ వస్తోంది శ్రీయా. ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం లేదు. అలా అని క్యారెక్టర్ రోల్స్ చేయడం లేదు. ఇంపార్టెన్స్ ఉండాలి.. అందులో హీరోయిన్ నైజం ఉండాలి.. అలాంటి పాత్రకు అయితేనే సై అంటోంది.