మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి ప్రస్తుతం చేయబోతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాకు దర్శకుడు వశిష్ట ఇక ఈ సినిమాను యువి క్రియేషన్స్ వాళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన  షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి లేని సన్నివేశాలను దర్శకుడు షూటింగ్ చేసే పనిలో ఉన్నారు. చిరంజీవి కూడా త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉండగా... ఈ సినిమా షూటింగ్ చేసిన తర్వాత మెగాస్టార్ వేరే సినిమా కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు

 విశ్వసనీయ సమాచారం. బాలయ్య తో భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రవిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించినట్లు సమాచారం. అయితే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది చివర్ లో మొదలవుతుందని వినికిడి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మిగతా విషయాలు తెలియాల్సి ఉంది. అయితే మెగాస్టార్ వచ్చే ఏడాది ఆగస్టుకి  70 సంవత్సరాలలోకి అడుగుపెడతారు ఆయన. అయితే ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ రానున్న తరానికి కూడా ప్రేరణగా నిలుస్తున్నారు

 మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ సినిమా ఎలాంటి హిట్ నువ్వు సంపాదిస్తుందో అభిమానులు ఎదురుచూస్తున్నారు.అనిల్ రావిపూడి డైరెక్షన్ అనేసరికి మెగా అభిమానులు, ప్రేక్షకులు 'చంటబ్బాయ్' రేంజ్ స్క్రిప్ట్ ఆశిస్తున్నారు. చిరంజీవిలో వింటేజ్ కామెడీ టైమింగ్ బయటకు తీసే సత్తా అనిల్ రావిపూడికి ఉందని, ఆయన శైలి కామెడీకి మెగాస్టార్ తోడు అయితే భలే ఉంటుందని అనుకుంటున్నారు. మెగా హీరోలతో 'దిల్' రాజు సినిమాలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' చేశారు. అంతకు ముందు రామ్ చరణ్ హీరోగా 'ఎవడు' సినిమా చేశారు. ప్రస్తుతం ఆయనతో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. అయితే... మెగాస్టార్ చిరంజీవితో ఇప్పటి వరకు 'దిల్' రాజు సినిమా చేయలేదు. ఇది తొలి సినిమా అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: