నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని డిసెంబర్ 7న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. హాయ్ నాన్న మూవీ కి సెన్సార్ యూనిట్ క్లీన్ U సర్టిఫికెట్ ఇచ్చింది. సుమారు 155 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా ఉండబోతోంది. కాదా ఈ సినిమాకి సెన్సార్ బోర్డు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చింది. సినిమా చాలా అద్భుతంగా ఉందని, 

ముఖ్యంగా సినిమాలో ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ని చాలా ఎమోషనల్ గా చూపించారట. అంతేకాదు సినిమాలో కొన్ని మేజర్ ఎమోషనల్ సీక్వెన్స్ లు సెన్సార్ సభ్యులను సైతం కంటతడి పెట్టించాయని అంటున్నారు. ఖచ్చితంగా థియేటర్స్ లో విడుదలయ్యాక ఈ సినిమా ఆడియన్స్ ని బాగా మెప్పిస్తుందని సినిమా చూసిన సెన్సార్ టీమ్ చెబుతోంది. సెన్సార్ టాక్ తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఇప్పటివరకు విడుదలైన హాయ్ నాన్న సాంగ్స్ సినీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే నాని తెలుగులో నాన్ స్టాప్ ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉన్నాడు. 

పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అన్ని భాషల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. దాంతోపాటు విడుదలకు ఒక్కరోజు ముందు అంటే డిసెంబర్ 6న పెయిడ్ ప్రీమియర్ కూడా ప్లాన్ చేశారట. నాని అండ్ మూవీ టీమ్ అంతా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా హాయ్ నాన్న సెన్సార్ రిపోర్ట్ బయటికి రావడంతో సినిమాపై మరింత పాజిటివ్ హైప్ ఏర్పడింది. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సినిమాలో నాని కూతురుగా కియారా ఖన్నా కనిపించనుంది. మరో హీరోయిన్ శృతిహాసన్ కీలక పాత్ర పోషిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: