ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోలలో హీరో సూర్య కూడా ఒకరు.. ఎప్పుడూ కూడా అభిమానుల కోసం సరికొత్త కదా అంశాలతో విభిన్నమైన గెటప్పులతో అలరిస్తూనే ఉంటారు. చిన్న వయసులోనే బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చిన సూర్య ఆ తర్వాత ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించడం జరిగింది. ఇటీవలే కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమాలో చిన్న పాత్రలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో అమాంతం సూర్య మార్కెట్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు.

ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో దాదాపుగా 38 బాసరలో విడుదల చేయడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేమంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటివలే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఈ సినిమా హైపును భారీగా పనిచేస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేసేందుకు పలు రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. గతవారం కంగువ సినిమా షూటింగ్ సమయంలో హీరో సూర్యకు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే..


ఇందులో హీరో సూర్య గాయాలతో బయటపడడం జరిగింది. ఈ విషయం తెలిసి అభిమానుల సైతం చాలా ఆందోళనకు గురయ్యారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. ఇటీవల విశ్రాంతి తీసుకున్న సూర్య ముంబైకి వెళ్లిపోయారు తన భార్య జ్యోతిక తో కలిసి ముంబైకి వెళ్లిన సూర్యకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలో సూర్య చాలా కష్టంతో నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా శాఖ గురవుతున్నారు. మరి సూర్య కోలుకోవడానికి మరిన్ని రోజులు సమయం పడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: