మా తాతయ్య ఉర్దూలో ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఆయన ఉర్దూ చాలా స్పష్టంగా కూడా రాస్తారని ఉపాసన తెలియజేయడం జరిగింది. ఇక తన తండ్రి కూడా ఉర్దూ మాట్లాడవారని నానమ్మ మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేది కాబట్టి మాకు ఇంట్లో తెలుగు మాట్లాడే అవకాశం వచ్చేది కాదని తెలియజేయడం జరిగింది. అప్పట్లో దూరదర్శన్లో శనివారం మాత్రమే హిందీ సినిమా ఆదివారం తెలుగు సినిమా వచ్చేవి ఇలా తెలుగు సినిమాలను చూసేవాళ్ళమని తెలుగు సినిమాలలో కొన్ని సన్నివేశాలు ఇప్పటికి తనకి బాగా గుర్తున్నాయని తెలియజేయడం జరిగింది.
ఇలా ఇంట్లో ఎవరూ కూడా తెలుగు మాట్లాడే వారు లేకపోవడంతో తమకు తెలుగు అలవాటు లేదని అందుకే బాలీవుడ్ సినిమాలు మా లైఫ్ లో ఒక భాగమయ్యాయి అని తెలియజేయడం జరిగింది. ఉపాసన అప్పట్లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చాలాసార్లు చూశానని ఆ సినిమా బాగా నచ్చిందని ఉపాసన తెలియజేసింది.. మెగా ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన తర్వాత తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.. అప్పట్లో తెలుగు సినిమాలు చాలా తక్కువగా చూసిన వారి పేర్లు గుర్తులేవు అంటూ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.