రీసెంట్ టైమ్స్ లో రాంచరణ్ గేమ్ చేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ అయి సంచలనం సృష్టించగా, గుంటూరు కారం నుంచి మహేష్, వెన్నెల కిషోర్ మధ్య జరిగే ఓ సన్నివేశం తాలూకు చిన్న బీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించి లీకైన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమెతో పాటూ నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా ఈ మూవీలో క్యామియో రోల్ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. 

మూవీ టీం నుంచి దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ తాజాగా లీకైన వీడియో పుణ్యమా అని ఫ్యామిలీ స్టార్ లో రష్మిక క్యామియో కన్ఫామ్ అయింది. రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించి ఢీల్లీలో ఓ సాంగ్ ని  చిత్రీకరించారు. హీరోయిన్ మృణాల్ ఠాగూర్ తో పాటు స్పెషల్ క్యామియో చేస్తున్న రష్మిక మందన ఈ సాంగ్ షూట్లో పాల్గొంది. మూవీ టీమ్ దీన్ని సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేస్తే ఇప్పుడు లీకుల పుణ్యమా అని అందరికీ ముందే తెలిసిపోయింది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచంలో సినిమాకు సంబంధించి ఏ చిన్న బిట్ లీక్ అయి బయటికి వచ్చిన సరే అది సినిమాపై చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. 

రాజమౌళి లాంటి టాప్ ఫిలిం మేకర్ ఈ లీక్స్ ని కట్టడి చేయాలని ప్రయత్నించి విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ లేకులపై ఫ్యామిలీ స్టార్ మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నప్పటికీ డైరెక్టర్ పరుశురాం సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందే ఆర్టిస్టుల డేట్స్ తీసుకోవడంతో అవి వృధా కాకుండా ఇండియాలో తీయాల్సిన ఎపిసోడ్స్, సాంగ్స్ అన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇక ఫారిన్ షెడ్యూల్ ఒకటే మిగులుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: