డిసెంబర్ నెలలో యానిమల్, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, హాయ్ నాన్న సలార్ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో నితిన్, నాని సినిమాలకు మిగతా సినిమాలతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 'యానిమల్' హైప్ తో హాయ్ నాన్న, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలకు ఆడియన్స్ లో పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఈ రెండు సినిమాల ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఉన్నా సినీ లవర్స్ అంతా 'యానిమల్' కోసమే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే 'యానిమల్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటినుంచి ఇండస్ట్రీ వర్గాలతో

 పాటు ప్రేక్షకుల్లో ఈ సినిమా గురించే డిస్కషన్ జరుగుతోంది. దానికి తోడు మూవీ టీం కూడా మరింత హైప్ పెంచేందుకు వరుస ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారు. దాంతో 'యానిమల్' కి ఉన్న క్రేజ్ నితిన్, నాని సినిమాలకు లేకుండా పోయింది. మరోవైపు డిసెంబర్ 1న 'యానిమల్' రిలీజ్ అవుతుంది. సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే సుమారు రెండు వారాలైన థియేటర్స్ లో రచ్చ చేయడం గ్యారెంటీ. దీని తర్వాత రిలీజ్ అవుతున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, హాయ్ నాన్న సినిమాల కలెక్షన్స్ పై యానిమల్ ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతేకాదు డిసెంబర్

 చివరలో మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ థియేటర్స్ లోకి రాబోతోంది. సలార్ వస్తే థియేటర్లో ఎన్ని సినిమాలు ఉన్నా ఆడియన్స్ పట్టించుకోరు. దీని ప్రకారం చూస్తే ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, హాయ్ నాన్న వచ్చిన 15 రోజులకే సలార్ థియేటర్స్ లో సందడి చేయనుంది. అంటే ఈ రెండు సినిమాలకి ఉన్న టైం కేవలం 15 రోజులు మాత్రమే. 15 రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి, లాభాలు రావాలి అంటే కష్టమే. కాబట్టి ఈ రెండు సినిమాల్లో ఏదో ఏదో ఒకటి వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయితే బాగుంటుందనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి సలార్ ఎఫెక్ట్ తో డిసెంబర్లో రావలసిన చాలా సినిమాలు సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: