టాలీవుడ్ యువ నటుడు నితిన్ తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని డిసెంబర్ 8 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ మూవీ మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను ... సాంగ్స్ ను విడుదల చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ జనాలను లభించింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు .... అలాగే రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ ని 2 గంటల 36 నిమిషాలు నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

హరిజ్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే నితిన్ ఆఖరుగా మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో.గా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అందుకున్నాడు. క్యాథరిన్ ,  కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించగా ... సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి మాచర్ల నియోజకవర్గం మూవీ తో అపజయాన్ని ఎదుర్కొన్న నితిన్ "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే డిసెంబర్ 8 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: