స్టార్ హీరోలైన టాలీవుడ్ నటులతో నటించి అగ్ర హీరోయిన్గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ భూమిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించింది.ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కాస్త సైలెంట్ అయింది. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన అభిపెద్దగా సక్సెస్ కాలేక పోయింది. యంగ్ హీరోల చిత్రాలలో ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్న భూమిక నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా భూమిక తనకు వచ్చిన ఒక లవ్ లెటర్ ని సైతం షేర్ చేయడం జరిగింది. ఒక అభిమాని తనకి లవ్ లెటర్ రాశారని అయితే అది తనకు పంపించకుండా తన భర్తకు పంపించాలంటూ కూడా కోరినట్లుగా ఆ లెటర్లో రాయడంతో భూమిక సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేయడం జరిగింది. దీంతో ఆ అభిమాని తనపై ఉన్న ప్రేమను అభిమానం చూపించడంతోపాటు తనపై ఉన్న ప్రేమను ఇలా చూపించారంటూ తెలియజేసినట్లు తెలుస్తోంది.. దీంతో పలువురి నేటిజన్స్ సైతం ఎవరైనా ప్రేమిస్తే డైరెక్ట్ గా ప్రేమలేఖలు ఇస్తారు కానీ వారి జీవిత భాగస్వామికి ఇలా పంపిస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఏదో విధంగా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ ఆ అభిమాని లక్కీ అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2007వ సంవత్సరంలో భరత్ ఠాగూర్ ని వివాహం చేసుకుంది భూమిక.. అయితే భూమిక జీవితం పై కూడా ఎన్నో రకాల రూమర్సు వినిపించాయి.. భూమికను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకుంటారని ప్రచారం కూడా వినిపించింది.. భూమిక మరియు భరత్ ఠాగూర్లు కలిసే ఉన్నారనేందుకు తాజాగా ఈ పోస్టులు నిదర్శనం అంటూ పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వయసులో కూడా భూమికాకు లవ్ లెటర్లు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: