అఖండ తర్వాత బాలయ్య వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తుండడం, అవి కూడా మంచి విజయాలను అందుకుంటుండడంతో ఫ్యాన్స్ రాబోయే రోజుల్లో మరిన్ని కంటెంట్ ఉన్న సినిమాల్లో బాలయ్య నటించాలని కోరుకుంటున్నారు. అటు బాలయ్య కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తన మార్కెట్ ని అమాంతం పెంచుకుంటూ పోతున్నాడు. ప్రెజెంట్ ఉన్న సీనియర్ హీరోల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది కూడా బాలయ్యకే. అందుకే యువ దర్శకులు కూడా బాలయ్య ఇమేజ్ కి తగ్గట్లు సరికొత్త కథలతో సినిమాలు తీసేందుకు ముందుకు వస్తున్నారు.   

ఇటీవల 'భగవంత్ కేసరి' తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 2024 ఎన్నికల సమయంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో బాలయ్య ఏకంగా మూడు విభిన్న తరహా పాత్రల్లో కనిపిస్తారని తాజా సమాచారం వినిపిస్తోంది. అంతేకాదు సినిమాలో ఒక్కో పాత్ర ఒక్కో విధంగా ప్రవర్తిస్తుందని, ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచుతుందని అంటున్నారు. డైరెక్టర్ బాబి ఈ సినిమాలో బాలయ్య యాక్టింగ్ స్కిల్స్ ను డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయబోతున్నారట.

 రీసెంట్ గా వాల్తేరు వీరయ్యలో బాబి మెగాస్టార్ పాత్రని తీర్చిదిన్న విధానం అభిమానులనే కాదు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అంతకుమించి ఉండేలా బాలయ్య లోని యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ను1 మెస్మరస్ చేసేందుకు రెడీ అవుతున్నారట ఈ యంగ్ డైరెక్టర్. కాగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వేరే లెవెల్ లో ఉంటాయని అంటున్నారు. మూడు పాత్రల్లో బాలయ్య తన నట విశ్వరూపం చూపించబోతున్నారట. ఇక ఈ అప్డేట్ తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. డైరెక్టర్ బాబి ఈ సినిమాతో బాలయ్య రేంజ్ ని మరింత పెంచుతాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: