కాగా ప్రస్తుతం బిగ్ బాస్ షో టాప్ సెవెన్ కి చేరుకుంది. హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న గౌతం 13వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరైనా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు అంటే చాలు వారికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా హౌస్ లో ఉన్నన్ని రోజులు వారానికి ఆయా కంటెస్టెంట్స్ ఎంత పారితోషకం తీసుకున్నారు అన్నది కూడా తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇటీవల 13వ వారం లో ఎలిమినేట్ అయిన గౌతం కృష్ణ ఎంత పారితోషకం తీసుకున్నాడు అన్నది వైరల్ గా మారిపోయింది. అయితే వారానికి 1.75 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడట గౌతమ్. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న 13 వారాలకు గాను 22.75 లక్షల రూపాయలు పారితోషకం అందుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగినప్పటికీ.. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో పోల్చి చూస్తే గౌతమ్ కృష్ణకు కాస్త తక్కువ పారితోషకం అందింది అని చెప్పుకోవచ్చు