ఇండస్ట్రీలో డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్లలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన యానిమల్ అనే సినిమాని తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇందులో హీరోగా రణబీర్ కపూర్ నటించగా రష్మిక హీరోయిన్గా నటించిన జరిగింది.అలాగే బాబి డియోల్ విలన్ గా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమా కేవలం మూడు రోజులలోనే 360 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టి రణబీర్ కెరీర్ లోనే అతి తక్కువ సమయంలో ఎన్ని కోట్లు రాబట్టిన చిత్రంగా పేరు సంపాదించింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.


అయితే ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రౌడీలను చంపడానికి ఒక మిషన్ గన్నుని సైతం ఉపయోగిస్తారు. ఇక ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ లో మిషన్ గాని ఏర్పాటు చేద్దామనుకున్నారట చిత్ర బృందం. కానీ ఇదంతా నేచురల్ గా ఉండదని డైరెక్టర్ అనుకోవడంతో దీన్ని ఒరిజినల్ గా తయారు చేయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.. దీంతో కొంతమందిని పిలిపించి మరి మూడు నెలల పాటు వాళ్ల చేత ఈ గన్నని తయారు చేయించారట. అందుకే ఈ మిషన్ గన్ షాట్స్ అనేవి చాలా అద్భుతంగా వచ్చాయని సినీ ప్రేక్షకుల సైతం తెలియజేస్తున్నారు.


అయితే ఈ మిషన్ గన్  కోసం దాదాపుగా కోటి రూపాయల వరకు ఖర్చయినట్లుగా సమాచారం. దీనికోసం మూడు నెలలు వెయిట్ చేసిన తర్వాతే ఈ సినిమా షూటింగులు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కి సినిమాలంటే ఎంత పిచ్చో అని చెప్పవచ్చు. అందుకే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: