టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య తాజాగా నటించిన వెబ్ సిరీస్ దూత.. ఈ సీరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ వెబ్ సిరీస్ తో మంచి మార్కులు అందుకున్నారు నాగచైతన్య.. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న నాగచైతన్య ఇందులో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలలో హాజరవుతూ ఫుల్ బిజీగా ఉంటున్నారు.. తాజాగా ఒక మీడియా పత్రికకు ఇంటర్వ్యూ చేస్తూ తను నటించిన బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్ద ఫ్లాప్ కావడం పైన స్పందించారు.


సినిమా ప్రేక్షకు ఆదరణ పొందనందుకు ఎలాంటి బాధ లేదని తెలియజేయడం జరిగింది. దూతలో తన పాత్ర జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయని అలాగే కూడా లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా తనకు తెలిసినప్పటికీ కూడా ఆ సినిమాలో నటించాలని తెలిపారు  ఎందుకంటే ఆ సినిమాలో నేను అమీర్ ఖాన్ తో కలిసి నటిస్తాను కాబట్టి ఫలితం గురించి ఆలోచించకుండా నటించానని తెలియజేశారు. ఆయనతో నటించి నేను చాలా విషయాలను సైతం నేర్చుకున్నానని అందుకే దాని ఫలితం తనను ఇప్పటికీ బాధించలేదని తెలియజేశారు. అలాంటి సినిమాలో నటించినందుకు ఇప్పటికీ ఆనందంగానే గర్వపడుతున్నానని తెలియజేశారు నాగచైతన్య.


జీవితంలో ఎన్నో ఒడిదులుకులు ఉంటాయి అలాగే సినిమా విషయంలో హిట్ ప్లాపులు అనేవి కూడా సహజంగానే ఉంటాయి.వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాల్సిందే అంటూ తెలిపారు.ప్రస్తుతం నాగచైతన్య డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న తండెల్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తూ ఉన్నది.ఈ సినిమా మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగచైతన్య పాత్ర చిన్నదే అయిన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: