బాలీవుడ్ ఫేమస్ సీరియల్ సీఐడీ లో ఫెడ్రిక్స్ అలియాస్ ప్రణీత్ అనే పాత్రలో సుమారు 20 ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించిన ఈయన సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరిన దినేష్ ఫడ్నిస్ శనివారం నుంచి వెంటిలేటర్ పైనే ఉన్నారు. మొదట్లో అతనికి హార్ట్ ఎటాక్ రావడం వల్ల హాస్పిటల్లో చేరారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అది నిజం కాదని దినేష్  సహనటుడు దయానంద్ శెట్టి చెప్పారు. దినేష్ ఫడ్నిస్ హాస్పిటల్ లో చేరాడని, పెంటిలేటర్ పైనే ఉన్నాడని, డాక్టర్లు అతన్ని పరిశీలిస్తున్నారని, 

అతనికి హార్ట్ ఎటాక్ రాలేదని, వేరే చికిత్స నడుస్తోందంటూ శనివారం రోజు  వెల్లడించారు. పాపులర్ క్రైమ్ సీరియల్ సీఐడీ లో సీనియర్ ఇన్స్పెక్టర్ దయా పాత్రలో దయానంద్ శెట్టి నటించారు. ఇండియన్ టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక కాలం సాగిన టీవీ షోలలో సీఐడీ కూడా ఒకటి. ఇందులో దినేష్ పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. సీఐడీ  సీరియల్ లో నటించడంతో పాటు ఇందులో కొన్ని ఎపిసోడ్లకు దినేష్ రచయితగాను వ్యవహరించడం విశేషం. అంతేకాకుండా బాలీవుడ్ మరో టీవీ షో 'తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా' లోను అతిధి పాత్రలో కనిపించారు దినేష్. 

అలాగే సర్ఫరోష్, సూపర్ 30 లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఓ మరాఠి సినిమాకు రచయితగా కూడా పనిచేశారు. అలాంటి ఈయన అనారోగ్య కారణాలతో కన్నుమూయడం బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ముఖ్యంగా టీవీ ఇండస్ట్రీ ప్రముఖులు దినేష్ మరణం జీర్ణించుకోలేకపోతున్నారు. సీఐడీ సీరియల్ ముగిసిన తర్వాత దినేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉన్నారు. చాలా రోజులుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న దినేష్ ఆకస్మిక మరణం అభిమానులను ఎంతగానో బాధిస్తుంది. ఆయన మరణ వార్త విన్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: