ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండిగ్ నేపథ్యంలో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన యానిమల్ చిత్రంలో రణ్ బీర్ తన నట విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అందరూ యానిమల్ ట్రాన్స్ లోనే ఉన్నారు. రణ్ బీర్ తర్వాత విలన్ గా చేసిన బాబీ డియోల్ పాత్రకు భారీ రెస్పాన్స్ లభించింది. అలాగే చాలా రోజుల తర్వాత రష్మిక ఈ మూవీలో మంచి నటన కనబరిచింది. చాలా కాలంగా గ్లామర్ పాత్రలు చేస్తున్న రష్మికకి యానిమల్ లో యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్ దక్కడంతో తన పాత్రలో అదరగొట్టింది. కొన్ని కొన్ని సీన్స్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయినా కూడా లాభం లేకుండా పోయింది. 

రష్మిక కంటే సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన కొందరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక తో పాటు తృప్తి దిమిరి ఓ కీ రోల్ ప్లే చేసింది. సినిమాలో తన బోల్డ్ నెస్ తో యూత్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. దీంతో సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ అంతా సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించి సర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈమె తర్వాత విలన్ బాబీ డియల్ ముగ్గురు భార్యలుగా నటించిన వాళ్లు కూడా తమ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాబీ డియోల్ మూడో భార్య స్క్రీన్ పై ఎంతో అందంగా కనిపించడం,

 ఆమెతో బాబి డియోల్ సీన్స్ కి థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు తప్పితే రష్మికను ప్రత్యేకంగా మెచ్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ సినిమాతో రష్మిక కు హిట్ వచ్చినా కూడా ఆమె లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సీన్స్ లో నటించడంతో ట్రోల్స్ తప్పడం లేదు. దానికి తోడు రష్మిక కంటే సినిమాలో నటించిన మిగతా వాళ్ళే ఎక్కువగా వైరల్ అవుతున్నారు. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకి మరో ఆఫర్ తో అయినా ఇలాంటి గాసిప్స్, ట్రోల్స్ ఆగుతాయేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: