టాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరు పొందిన నితిన్ సరైన సక్సెస్ అందుకోలేక చాలా కాలం అవుతోంది .సాలిడ్ కం బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించడం జరిగింది. మరి ఈ సినిమాతో నితిన్ ఏ విధంగా సక్సెస్ అయ్యారో లేదో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా పైన పాజిటివ్ గానే రివ్యూస్ వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాని యాక్షన్ లాంటి ఎక్స్పెక్టేషన్ ఏమీ లేవని కామెడీ ప్రియులకు ఈ సినిమా బాగా వర్క్ అవుట్ అవుతుందని తెలియజేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో రాజశేఖర్ అతిథి పాత్రలో నటించడం ఈ సినిమాకి కాస్త ప్లస్ అయ్యిందని కథలో కొత్తదనం లేకపోయినా రొటీన్ స్టోరీ అయినా కామెడీతో నితిన్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నారని కామెంట్స్ ని చేస్తున్నారు నేటిజన్స్. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు ఈ సినిమా ట్రైలర్ టీజర్ తోని మంచి పాపులారిటీ సంపాదించుకున్నది.


నాన్ స్టాప్ నవ్వులతో నితిన్ ప్రేక్షకులను బాగా నవ్వించారని సెకండ్ హాఫ్ లో వచ్చే పాటలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలియజేశారు. అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇందులో కొంచెం కామెడీ ఎక్కువగా ఉండడంతో అదే మైనస్ గా ఉంటుందని కూడా తెలుపుతున్నారు. శ్రీ లీల పాత్ర కూడా చాలా అద్భుతంగానే ఉందని మరొకసారి తన టాలెంట్ తో ఈ సినిమాతో ప్రూఫ్ చేసుకోమని మరో నేటిజన్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏ మేరకు నితిన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఫుల్ రివ్యూ వచ్చేవరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: