టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగ చైతన్య ... చందు మండేటి దర్శకత్వంలో రూపొందబోతున్న తండెల్ అనే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ టైటిల్ పోస్టర్ ను విడుదల చేయడం మాత్రమే కాకుండా ఈ సినిమాలోని నాగ చైతన్య కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. దీనికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.

 ఇకపోతే ఈ మూవీ లో సాయి పల్లవి ... నాగ చైతన్య కు జోడిగా కనిపించనుండగా ... ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ మూవీ బృందం విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యొక్క ఓపెనింగ్ సెర్మని కి సంబంధించిన అప్డేట్ ను ఈ మూవీ బృందం విడుదల చేసింది.

 ఈ సినిమా యొక్క ముహూర్తం సేర్మని ని రేపు అనగా డిసెంబర్ 9 వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గ్లాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నట్లు ఈ ముహూర్తం సేర్మని కి టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ... విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా రానున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే నాగ చైతన్య ... చందు మండేటి కాంబినేషన్ లో ప్రేమమ్ ... సవ్యసాచి అనే రెండో మూవీ లు రూపొందాయి. వీరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. ఇకపోతే ప్రేమమ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని సాధించగా ... సవ్యసాచి మూవీ మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది. మరి తండెల్ మూవీ ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: