ఈ మధ్యకాలంలో అయితే విజయ్, రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలలో బ్యాక్గ్రౌండ్ ఒకేలాగా కనిపిస్తుండడంతో ఇద్దరూ ఒకే చోట ఉంటున్నారని ప్రచారం కూడా జరిగింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే రీసెంట్ గా నాని హీరోగా నటించిన హాయ్ నాన్న ప్రీ1 రిలీజ్ ఈవెంట్ లోనూ వీళ్ళిద్దరి పర్సనల్ ఫోటోలు డిస్ప్లే అవ్వడం ఎంతటి హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఇక మరోసారి నితిన్ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో వీళ్లిద్దరి రిలేషన్షిప్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మూవీలో విజయ్, రష్మిక రిలేషన్ ఏంటి అని జూనియర్ ఆర్టిస్టు 

అయిన నితిన్ ను అడిగితే అల్లు అర్జున్ జులాయి సాంగ్ తో క్లారిటీ ఇస్తాడు. జులాయి మూవీలో టైటిల్ సాంగ్ గుర్తుండే ఉంటుంది. అందులో లిరిక్స్ అన్ని "నేనేం చేస్తే నీకేంటి?" అనే అర్థం వచ్చేలానే ఉంటాయి. నేనెట్టగుంటే నీకేంటన్నాయ్.. నేను ఏడ పుడితే నీకేంటన్నయ్.. నేనేంటి చేస్తే నీకేంటన్నాయ్.. సిర్రాకు పెట్టాకన్నాయ్.. ఇలా ఆ పాటలో లిరిక్స్ ఉంటాయి. ఇక నితిన్ సినిమాలో ఇదే సాంగ్ కి స్టెప్పులు వేసి మీ పని మీరు చూసుకోండి.. వాళ్ళు ఏం చేస్తే మీకేంటి? అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో సినిమాలో ఈ సీన్ చూసి ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

 కొంతమంది అయితే ఆ సీన్ ని తమ కెమెరాల్లో బంధిస్తూ విజయ్ దేవరకొండ, రష్మిక మందన పేర్లని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి దీనిపై అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ రియాక్ట్ అవుతారేమో చూడాలి. ఇక ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ విషయానికొస్తే.. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి విశ్రమ స్పందన లభిస్తోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటించింది. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: